Sonia Gandhi : విపక్ష నేతలతో సోనియాగాంధీ సమావేశం..!

2024 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని అన్ని ప్రతిపక్ష పార్టీలు పావులు కదుపుతున్నాయి. అందుకు విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి.

Update: 2021-08-20 14:30 GMT

ఢిల్లీలో విపక్ష నేతలతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సమావేం కొనసాగుతోంది. వర్చువల్‌ ద్వారా జరుగుతున్న ఈ సమావేశంలో పలు రాష్ట్రాల సీఎంలు, పార్టీల నేతలతో సోనియా గాంధీ చర్చిస్తున్నారు. తృణమూల్ సహా 19 పార్టీల నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పెగాసస్, రైతుల ఆందోళనలు, నూతన వ్యవసాయ చట్టం, దేశంలో కొవిడ్ పరిస్థితులు సహా కీలకమైన పలు అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నారు.

2024 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని అన్ని ప్రతిపక్ష పార్టీలు పావులు కదుపుతున్నాయి. అందుకు విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు నాయకులతో మంతనాలు జరిపారు. ఇక ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేలతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా పలుసార్లు చర్చలు జరిపారు. ఇపుడు తాజాగా కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ నేరుగా రంగంలోకి దిగారు.

పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రతిపక్ష పార్టీల అధినేతలతో వర్చువల్ సమావేశం నిర్వహిస్తున్నారు. పెగాసస్, రైతుల ఆందోళనలు, నూతన వ్యవసాయ చట్టం, దేశంలో కొవిడ్ పరిస్థితులతో పాటు 2024 ఎన్నికలు, ఉమ్మడిగా చేపట్టాల్సిన వ్యూహాలు, కలిసికట్టుగా బీజేపీని ఎలా ఎదుర్కోవాలన్న అంశాలే ఎజెండాగా చర్చిస్తున్నారు.

Tags:    

Similar News