ఏసర్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్
కరోనా కష్టకాలంలో చాలా మంది తమకు తోచిన సాయం చేశారు. కానీ, కరోనా సాయం అంటే దేశంలో ఎవరికైనా గుర్తువచ్చేంది సోనూసూద్.;
కరోనా కష్టకాలంలో చాలా మంది తమకు తోచిన సాయం చేశారు. కానీ, కరోనా సాయం అంటే దేశంలో ఎవరికైనా గుర్తువచ్చేంది సోనూసూద్. వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చడంలో కీలక పాత్రపోషించారు. లక్షల మంది సోనూ వలన లాభం పొందారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సాయం చేశారు. దీంతో సినిమాల్లో విలన్ గా ఉన్న సోనూ రియల్ లైఫ్‌లో హీరో అనిపించుకున్నారు. దీంతో ఆయనకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను వాడుకునేందుకు ఏసర్ ఇండియా లాప్‌టాప్ సంస్థ ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్నది. దీంతో ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఆయన వ్యవహరించనున్నారు. ఏసర్‌లోని సాంకేతికతను వినియోగదారులకు వివరించడంలో సోనూసూద్ కీలకపాత్ర పోషిస్తారని కంపెనీ తెలిపింది. తమ సంస్థకు సోనసూద్ వంటి మానవతావాది, రియల్ హీరో బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం సంతోషంగా ఉందని, కస్టమర్లకు సరికొత్త టెక్నాలజీని అందించేందుకు ఏసర్ ఇండియా కృషి చేస్తోందని ఎండీ హరీష్ కోహ్లి అన్నారు.