ఆయన పాడిన పాటలు.. అన్నీ ఆణిముత్యాలు

సంగీత ప్రియుల్ని మంత్ర ముగ్ధుల్ని చేసిన బాలు గళం గాన గంధర్వం.

Update: 2020-09-25 11:29 GMT

ఎస్పీ బాల సుబ్రమణ్యం ఎన్ని వేల పాటలు పాడినా ఎప్పుడూ కొత్తగానే ఉండేది ఆయన స్వరం. సంగీత ప్రియుల్ని మంత్ర ముగ్ధుల్ని చేసిన బాలు గళం గాన గంధర్వం. భారతీయ భాషల్లో ఆయన సుమారు 40 వేలకు పైగా పాటలు పాడారు. అత్యధిక పాటలు రికార్డు చేసిన గాయకుడిగా ఆయన పేరిట ఒక రికార్డు కూడా ఉంది. ఒకే రోజు 56 పాటలు రికార్డు చేసిన అరుదైన ఘనత బాలు పేరు మీద ఉంది. 1981 ఫిబ్రవరి 8 న ఉదయం 9:00 నుండి రాత్రి 9:00 గంటల వరకు బెంగళూరులోని స్వరకర్త ఉపేంద్ర కుమార్ కోసం కన్నడలో 21 పాటలు, తమిళంలో 19 పాటలు, హిందీలో 16 పాటలు రికార్డ్ చేశారాయన.

Tags:    

Similar News