Speaker Om Birla: లోక్‌‌‌‌‌సభలో కులాల ప్రస్తావన.. స్పీకర్ స్ట్రాంగ్ వార్నింగ్

Speaker Om Birla: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌.. తన హిందీ గురించి చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు రేవంత్‌ రెడ్డి.;

Update: 2022-12-13 07:42 GMT

Speaker Strong Warning: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌.. తన హిందీ గురించి చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు రేవంత్‌ రెడ్డి. తాను శూద్రుడిని కాబట్టి స్వచ్ఛమైన హిందీ రాదన్నారు. ఆమె బ్రాహ్మణవాది కాబట్టి స్వచ్ఛమైన హిందీ వస్తుందని... అయితే అదేమీ తనకు సమస్య కాదన్నారు రేవంత్‌.




కులాల ప్రస్తావన రావడంతో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా వారించారు. సభలో ఎవరూ కులం, మతం ప్రస్తావన తీసుకురాకూడదని ఆదేశించారు. ఎవరైనా అలాంటి పదాలు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.



లోక్‌సభలో సోమవారం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌, కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. రేవంత్‌ హిందీ యాసను నిర్మల సీతారామన్‌ హేళన చేస్తూ మాట్లాడటం, అందుకు రేవంత్‌ ఘాటైన సమాధానం ఇవ్వడంతో సభలో దుమారం రేగింది. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ పరిణామం జరిగింది.



రూపాయి విలువ పడిపోవడంపై రేవంత్‌రెడ్డి హిందీలో ప్రశ్న అడిగారు.మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు రూపాయి ఐసీయూలో ఉందంటూ పోల్చారంటూ గుర్తు చేశారు. రూపాయి పతనాన్ని అరికట్టేందుకు ఇప్పుడు మోదీ ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు.



దీనికి స్పందించిన నిర్మలా సీతారామన్‌ …… రేవంత్‌రెడ్డి వీక్‌ హిందీ లో అడిగిన ప్రశ్నకు వీక్‌ హిందీలో నే సమాధానం ఇస్తానంటూ హేళనగా మాట్లాడారు. ఆ సమయంలో ఆర్థిక వ్యవస్థ సైతం ఐసీయూలో ఉందని…. కానీ ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోందన్నారు. 

మొత్తానికి హిందీ వివాదంపై కేంద్రమంత్రి నిర్మల సీతారామన్‌ వ్యాఖ్యలు, రేవంత్‌ ప్రతివ్యాఖ్యలు లోక్‌సభలో దుమారం రేపాయి.

Tags:    

Similar News