Delhi pollution : ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Delhi polution : దేశ రాజధానిలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Update: 2021-11-24 13:40 GMT

Delhi polution : దేశ రాజధానిలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఇంట్లో కూడా మాస్కులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కాలుష్య కట్టడికి తీసుకుంటున్న చర్యలతో ప్రపంచానికి ఏం సంకేతాలు పంపుతున్నారని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వతంగా కాలుష్య నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు సూచించింది.

Tags:    

Similar News