supreme court : సుప్రీంకోర్టుకు చేరిన హిజాబ్ వివాదం
supreme court : హిజాబ్ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. కర్ణాటక హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఓ విద్యార్థి పిటిషన్ వేశారు.;
supreme court :హిజాబ్ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. కర్ణాటక హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఓ విద్యార్థి పిటిషన్ వేశారు. ఇతరులను రెచ్చగొట్టేలా విద్యాసంస్థల్లో ఎలాంటి వస్త్రాలు ధరించొద్దంటూ కర్ణాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కర్ణాటక హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలంటూ అత్యున్నత న్యాయస్థానాన్ని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. ముస్లింల ప్రాథమిక హక్కును కాలరాసేలా కర్ణాటక హైకోర్టు ఆదేశాలున్నాయని పిటిషనర్ కోర్టుకు వివరించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హిజాబ్ వివాదంపై అత్యవసర విచారణ జరపాలని కోరారు. ఐతే అత్యవసర విచారణకు కోర్టు నిరాకరించింది.