బామ్మగారికి బాలేదు.. ఐసీయూలో చికిత్స
చిన్నారి పెళ్లి కూతురులో బామ్మగారి నటనకు ఫిదా అవని ప్రేక్షకులు లేరు.. ఒక్క మాటతో కుటుంబాన్నంతటని ఏకతాటిపై నిలబెడుతుంది.;
చిన్నారి పెళ్లి కూతురులో బామ్మగారి నటనకు ఫిదా అవని ప్రేక్షకులు లేరు.. ఒక్క మాటతో కుటుంబాన్నంతటని ఏకతాటిపై నిలబెట్టే పాత్ర పోషించిన బామ్మ.. మనవరాలికి ప్రేమని, ఆప్యాయతనీ పంచడంతో పాటు కుటుంబానికి కావలసిన విలువల్నీ నేర్పిస్తుంది. 75 ఏళ్ల బామ్మ సురేఖా సిక్రీ బ్రెయిన్ స్ట్రోక్‌తో మంగళవారం ముంబైలోని ఆసుపత్రిలో చేరారు. జాతీయ అవార్డు గ్రహీత అయిన బామ్మ నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ ఘోస్ట్ స్టోరీస్‌లో జోయా అక్తర్ విభాగంలో చివరిసారిగా కనిపించారు. ఐసియూలో ఉన్న ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని బామ్మ మేనేజర్ వివేక్ తెలిపారు. 2018 నవంబర్ లో ఒకసారి స్ట్రోక్ వచ్చింది.. మళ్లీ ఇప్పుడు రెండవసారి వచ్చిందని వివేక్ తెలిపారు. సురేఖా సిక్రీ చికిత్స కోసం ఆర్థిక సహాయం కోరుతున్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది. వివేక్ మాట్లాడుతూ.. బాలీవుడ్ నుండి ఆమెకు సహాయం చేయడానికి చాలా మంది వచ్చారని తెలిపారు. నాలుగు దశాబ్దాలకు పైగా తన సినీ కెరీర్‌లో సుమరే సిక్రీ తమస్, మమ్మో, సర్దారీ బేగం, రెయిన్‌కోట్ వంటి చిత్రాలకు గాను నటనకు మంచి మార్కులు కొట్టేసింది బామ్మ. సురేఖా సిక్రి జస్ట్ మొహబ్బత్, బనేగి అప్ని బాత్, సాత్ పెరే, బాలికా వధు వంటి టీవీ సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.