215వ సారి నామినేషన్.. గిన్నీస్‌బుక్‌లో చోటే లక్ష్యం..!
త్వరలోనే తమిళనాడు రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.. పార్టీ అభ్యర్దులతో పాటుగా స్వత్రంత అభ్యర్థులు కూడా నామినేషన్లు వేస్తున్నారు.;
త్వరలోనే తమిళనాడు రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.. పార్టీ అభ్యర్దులతో పాటుగా స్వత్రంత అభ్యర్థులు కూడా నామినేషన్లు వేస్తున్నారు. అందులో భాగంగానే తేర్దల్ మన్నన్ (ఎన్నికల రాజు) పద్మరాజన్ నామినేషన్ వేశారు. ఇక్కడ ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
గిన్నీస్‌బుక్ లో చోటే లక్ష్యంగా అన్ని ఎన్నికల్లో నామినేషన్ వేస్తుంటారు పద్మరాజన్.. తన ఇంటికి ఫోన్ కావాలని 1998లో తొలిసారి అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశారయాన.. తాజాగా 215వ సారి పోటికి సిద్దమయ్యారు. ప్రముఖల స్థానాల్లో పోటీ చేసే ఆయన.. డిపాజిట్టుకి డబ్బు లేకపోతే భార్య నగలను కుదవవెట్టి మరీ నామినేషన్ వేసిన ఘనత ఈయన సొంతం.
ప్రస్తుతం మేట్టూరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్దిగా నామినేషన్ వేశారు పద్మరాజన్ . కాగా 8వ తరగతి మాత్రమే చదువుకున్న ఆయన... సహకార సంఘాల ఎన్నికల నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు నామినేషన్లు వేయడం ఆనవాయితీగా పెట్టుకున్నారు.