Tamil Nadu Lockdown : తమిళనాడులో లాక్ డౌన్ పొడిగింపు..!

కరోనా కట్టడిలో భాగంగా తమిళనాడు ప్రభుత్వం మరో వారం రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించింది. ఆదివారంతో తాజాగా విధించిన లాక్‌డౌన్‌ ముగిస్తుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Update: 2021-05-22 12:02 GMT

కరోనా కట్టడిలో భాగంగా తమిళనాడు ప్రభుత్వం మరో వారం రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించింది. ఆదివారంతో తాజాగా విధించిన లాక్‌డౌన్‌ ముగిస్తుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తాజా లాక్‌డౌన్‌కు సంబంధించి ఎలాంటి సడలింపులూ లేకపోగా.. మరి కొన్ని కొత్త మార్గదర్శకాలను ప్రభుత్వం వెల్లడించింది. కేవలం ఫార్మసీ, పాల విక్రయ కేంద్రాలు, తాగునీరు, దినపత్రికల పంపిణీకి అనుమతి ఉంటుంది. కూరగాయలు, పండ్లు, ఇతర నిత్యావసర వస్తువులను అన్ని జిల్లాల్లోనూ సంచార వాహనాల్లో రాష్ట్ర ప్రభుత్వమే విక్రయిస్తుంది.

అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో అత్యవసర సేవలకు సంబంధించిన శాఖలకి మాత్రమే విధులు ఉంటాయి. అన్నీ ప్రైవేటు సంస్థలు సహా, బ్యాంకులు, ఐటీ ఉద్యోగులకి ఇంటి నుంచే పనిచేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ కామర్స్‌ సంస్థలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పనిచేసుకోవచ్చు. పెట్రోలు బంకులు, ఏటీఎమ్‌లు యథాతథంగా పని చేస్తాయి.శనివారం అన్ని దుకాణాలను రాత్రి 9 గంటల వరకు తెరిచే ఉంచొచ్చు. ఆదివారరం ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు తెరవచ్చనని ప్రభుత్వం తన మార్గదర్శకాలలో వెల్లడించింది 

Tags:    

Similar News