రేషన్ కార్డులు ఉన్న వారికి సంక్రాంతి కానుక.. అకౌంట్‌లో రూ.2500

పొంగల్ ప్యాకేజీ 2.6 కోట్ల బియ్యం కార్డుదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని,;

Update: 2020-12-21 10:38 GMT

ఎడపడ్డి నియోజకవర్గం నుండి 2021 అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచారాన్ని ప్రారంభించారు తమిళనాడు ముఖ్యమంత్రి కె. పళనిస్వామి. శనివారం రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ సంక్రాంతి పండుగ కానుకగా రూ .2,500 నగదును ప్రకటించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ.. సంక్రాంతి పంట పండుగను ప్రజలు జరుపుకునేలా 2021 జనవరి 4 నుంచి నగదు ప్రోత్సాహకాన్ని పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. రేషన్ కార్డుదారులంతా బియ్యం తీసుకోవడానికి అర్హులని ప్రభుత్వం ప్రకటించింది.



పొంగల్ ప్యాకేజీ 2.6 కోట్ల బియ్యం కార్డుదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని, పొంగల్ పండుగకు ముందు పంపిణీ చేయబడుతుందని పళనిస్వామి తెలిపారు. పొంగల్ పండుగ జనవరి 14 న వస్తుంది. గత సంవత్సరం, నగదు ప్రోత్సాహకం 1,000 రూపాయలు, ఇప్పుడు దానిని 1,500 రూపాయలు పెంచారు.

రూ .2,500 నగదుతో పాటు, కిలో బియ్యం, చక్కెర, ఎండు ద్రాక్ష, బెల్లం, దుస్తులు వంటి వాటిని కూడా రేషన్ కార్డుదారులకు ఉచితంగా ఇవ్వబడతాయని ముఖ్యమంత్రి పళనిస్వామి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 2కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుంది. పేదవాడి కళ్లలో పండగ కాంతులు తీసుకు వచ్చే ఇలాంటి పథకం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకు వస్తే బావుంటుంది. 

Tags:    

Similar News