తేజశ్వి యాదవ్ 2 వేల ఓట్ల తేడాతో బిజెపి నేత సతీష్ యాదవ్ కంటే..

తేజశ్వి ఓ మంచి రాజకీయ నాయకుడిగా తనకంటూ ప్రజలలో ఓ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు.

Update: 2020-11-10 08:11 GMT

రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జెడి) నేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్. ప్రస్తుతం 2,233 ఓట్ల తేడాతో వైశాలి జిల్లా రోహగ్‌పూర్నియోజకవర్గం నుంచి ఆధిక్యంలో ఉన్నారు.

బిజెపికి చెందిన సతీష్ కుమార్ యాదవ్, లోక్ జనశక్తి పార్టీ (ఎల్జెపి) రాకేశ్ రౌషన్ వరుసగా మధ్యాహ్నం 12.30 గంటలకు 7,275, 4,257 ఓట్లు సాధించినట్లు ఎన్నికల సంఘం వెబ్‌సైట్ తెలిపింది. తేజశ్వి 9,508 ఓట్లతో ముందంజలో ఉన్నారు. తేజశ్వి సిట్టింగ్ ఎమ్మెల్యే, 2015 ఎన్నికలలో బిజెపి సతీష్ యాదవ్‌ను 22,000 ఓట్ల తేడాతో ఓడించారు. సతీష్ యాదవ్ 2010 ఎన్నికల్లో తేజశ్వి తల్లి రాబ్రీ దేవిని ఓడించారు.

ఈ ఎన్నికలలో తేజశ్వి ఓ మంచి రాజకీయ నాయకుడిగా తనకంటూ ప్రజలలో ఓ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు. సీనియర్ ఆర్జెడి నాయకుడు, రాజ్యసభ ఎంపి మనోజ్ కె జా మాట్లాడుతూ, "బీహార్ ప్రజల నుండి నిపుణుల వరకు, రాష్ట్రాన్ని నిశితంగా అధ్యయనం చేసిన రాజకీయనాయకుడిగా ప్రజలు అతడిని గుర్తించారని అన్నారు.

రోహగ్‌పూర్ నియోజకవర్గంలో నవంబర్ 3 న రెండవ దశ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు నితీష్ కుమార్ ప్రభుత్వంలో మరో నలుగురు మంత్రుల రాజకీయ చరిత్రను కూడా నిర్ణయించనుంది.

Tags:    

Similar News