హిమాచల్‌ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడి 9 మంది పర్యాటకులు మృతి...!
హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లా సంగాల్ లోయలో విషాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడి దిల్లీకి చెందిన 9 మంది పర్యాటకులు మృతి చెందారు.;
హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లా సంగాల్ లోయలో విషాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడి దిల్లీకి చెందిన 9 మంది పర్యాటకులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. భూకంపం సంభవించినట్లుగా ఒక్కసారిగా కొండ పైనుంచి బండరాళ్లు వేగంగా కిందకు దూసుకొచ్చాయి. రాళ్ల ధాటికి లోయలో ఉన్న వంతెన కూలిపోయింది. ఈ ప్రమాదంలో పలు వాహనాలు, పర్యాటకుల విశ్రాంతి గదులు ధ్వంసం అయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.