బెంగాల్‌లో నేడు తుది విడత పోలింగ్ ..!
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల పర్వం తుది అంఖానికి చేరుకుంది. చివరిదైన ఎనిమిదో విడత అసెంబ్లీ ఎన్నికలు నేడు జరగనున్నాయి.;
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల పర్వం తుది అంఖానికి చేరుకుంది. చివరిదైన ఎనిమిదో విడత అసెంబ్లీ ఎన్నికలు నేడు జరగనున్నాయి. ఐదు జిల్లాల్లో 35 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం ఆరున్నర గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. ఈ స్థానాల్లో మొత్తం 283 మంది అభ్యర్థులు బరిలో ఉండగా... 84 లక్షల 77 వేల 728 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ కోసం మొత్తం 11 వేల 860 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. గతంలో చెలరేగిన హింసాత్మక ఘటనల దృష్ట్యా చివరి విడత పోలింగ్‌కు మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బలగాలు మోహరించాయి.