వాడిపోయిన పూలతో బిజినెస్.. వాట్ ఎన్ ఐడియా సర్‌జీ..

దేవాలయాల్లో ప్రతి రోజు అలంకరించే పూలను గంగానదిలో పడేయడం చూసి నది కలుషితమైపోతోందని ఆవేదన చెందాడు;

Update: 2020-11-10 11:23 GMT

పనికొచ్చే ఆలోచనలు చేయరా.. ఎందుకు ఆ పనికిమాలిన ఆలోచనలు.. వాడిపోయిన పూలతో బిజినెస్ అంట.. ఒక్కరోజు చెట్టు మీద ఉంటేనే వడబడినట్లై అటు దేవుడికీ పెట్టరు.. ఇటు తల్లోనూ పెట్టుకోరు.. అలాంటిది వాడి పారేసిన ఆ పూలతో ఏం చేస్తావురా.. అమ్మానాన్నకి తానేం చేద్దామనుకుంటున్నాడో అర్థం కాక అరుపులు.. అవన్నీ లెక్క చేయకుండా చేసి చూపించాడు సక్సెస్ అయ్యాడు ఢిల్లీకి చెందిన అంకిత్ అగర్వాల్.

PHOOL అని తన వెబ్‌సైట్ వ్యాపార సంస్థకు నామకరణం చేశాడు. దేవాలయాల్లో ప్రతి రోజు అలంకరించే పూలను గంగానదిలో పడేయడం చూసి నది కలుషితమైపోతోందని ఆవేదన చెందాడు.. తన వంతు ప్రయత్నం ఏదైనా చేయాలనుకున్నాడు.. స్నేహితులతో కలిసి దేవాలయాల వద్దకు వెళ్లి అక్కడి అధికారులతో మాట్లాడి వాడి పోయిన పూలను తమకు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. వీటితో అగరబత్తుల తయారీ ప్రారంభిస్తానని చెప్పాడు ఏం చేస్తావు వీటితో అని అడిగిన ఆలయ అధికారుల ప్రశ్నకు సమాధానంగా.

బిజినెస్ మొదలైంది.. పలువురికి ఉపాధి దొరికింది.. వ్యాపారం పుంజుకుంది. ఫూల్ ద్వారా విక్రయించే వస్తువులు ఏవీ పర్యావరణానికి హాని కలిగించవు. అగర్‌బత్తులతో పాటు ఇన్సెన్స్ కోన్స్, వెర్మికంపోస్ట్ వంటి వాటిని కూడా విక్రయిస్తుంటారు. రూ.290కు పైగా కొనుగోలు చేస్తే ఫ్రీ డెలివరీ సౌకర్యం కూడా ఉంది. ఆర్డర్ చేసిన వారికి దేశవ్యాప్తంగా ఎక్కడికైనా డెలివరీ లభిస్తుంది. ప్రధాన పట్టణాల్లో ఈ సంస్థకు రిటైల్ స్టోర్లు కూడా ఉన్నాయి. భాగ్యనగరంలోని సికింద్రాబాద్‌లో సైతం ఫూల్ స్టోర్ ఉంది.

Tags:    

Similar News