PM Modi: ప్రధాని హత్యకు కుట్ర.. ఎన్ఐఏ దర్యాప్తులో సంచలన విషయాలు..
PM Modi: ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందన్న కారణంతో..పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కదలికలపై దేశవ్యాప్తంగా NIA చేపట్టిన దాడులతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.;
PM Modi: ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందన్న కారణంతో..పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కదలికలపై దేశవ్యాప్తంగా NIA చేపట్టిన దాడులతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాని మోదీని హత్య చేసేందుకు పీఎఫ్‌ఐ కుట్ర పన్నినట్లు తెలిసింది.
ఈ ఏడాది జులైలో ప్రధాని బిహార్ పర్యటన సందర్భంగా... దాడికి విఫలయత్నం చేసినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో తెలిసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం పలువురికి శిక్షణ సైతం ఇచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మరికొందరు ప్రముఖులపైనా దాడులకు కుట్ర జరిగిందని, దాడులు చేసేందుకు శిక్షణ సైతం ఇచ్చిన విషయాన్ని గుర్తించినట్లు పేర్కొన్నాయి.
పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకలాపాలపైNIA దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి 105 మందిని అరెస్ట్ చేశారు. అటు తెలుగు రాష్ట్రాల్లోనూ సోదాలు నిర్వహించిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. ఎన్‌ఐఏ దాడుల తర్వాత పీఎఫ్‌ఐ ఆర్థిక కార్యకలాపాలపై ఈడీ దృష్టి సారించింది.
అటు ఎన్‌ఐఏ సోదాలను నిరసిస్తూ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేరళలో చేపట్టిన హర్తాళ్ హింసాత్మకంగా మారింది. ప్రభుత్వ బస్సులు, కార్యాలయాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. హింసాత్మక ఘటనల్లో కేరళ ప్రభుత్వానికి చెందిన 50 బస్సుల అద్దాలు, సీట్లు ధ్వంసమయ్యాయి. రాళ్లు తాకి పదిమంది ఉద్యోగులకు గాయాలయ్యాయి. పోలీసులపై కూడా దాడులు చేశారు. బీజేపీ నేతలు, ఆఫీసులే టార్గెట్‌గా దాడులకు తెగబడ్డారు.