బిగ్‌బాస్ బ్యూటీ.. యాంకర్‌గా ఎంట్రీ

యాంకర్‌గా ఎంట్రీ ఇస్తున్నందుకు చాలా ఎక్సయిటింగ్ గా ఉంది.

Update: 2020-10-01 11:08 GMT

అంతకు ముందు సినిమాల్లో నటించినా రాని పేరు, పాపులారిటీ బిగ్‌బాస్ 3 లో పాల్గొన్నాక వితికా శేరు ఎవరో అందరికీ తెలిసింది. నటుడు వరుణ్ తేజ్‌ని పెళ్లి చేసుకున్న వితిక ఇద్దరూ కలిసి బిగ్‌బాస్‌లోకి వచ్చి బుల్లితెర ప్రేక్షకులను అలరించారు. తాజాగా ఆమెకి ఓ ఛానెల్ యాంకర్‌గా అవకాశమిచ్చింది. అక్టోబర్ 4 నుంచి ప్రసారం కానున్న సామజవరగమన షోకు వితిక యాంకర్‌గా పనిచేయనుంది. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. యాంకర్‌గా ఎంట్రీ ఇస్తున్నందుకు చాలా ఎక్సయిటింగ్ గా ఉంది. మీరంతా నన్ను టీవీలో ఎప్పుడు చూస్తారా అని ఎదురు చూస్తున్నా.. అని ఓ ఫోటోని పోస్ట్ చేస్తూ క్యాప్షన్ ఇచ్చింది వితిక. 

Similar News