సింగర్ సునీత శ్రీవారి దర్శనం..
లాక్‌డౌన్ కారణంగా శ్రీవారిని దర్శించుకోలేకపోయానని, ఇప్పుడు ఇలా స్వామివారి దర్శనానికి;
ప్రముఖ సింగర్ సునీత కొత్త సంవత్సరంలో కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతోంది. ఈ ఆనంద క్షణాలను ఆస్వాదిస్తూ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. గురువారం ఉదయం వీఐపీ దర్శనంలో స్వామి వారిని దర్శించుకున్న సునీతను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇటీవల తన ఎంగేజ్‌మెంట్ జరిగిందని అందుకే స్వామి వారి ఆశీస్సులు పొందడానికి వచ్చానని అన్నారు. లాక్‌డౌన్ కారణంగా శ్రీవారిని దర్శించుకోలేకపోయానని, ఇప్పుడు ఇలా స్వామివారి దర్శనానికి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కాగా సునీత వివాహం జనవరి 9న జరగనుంది.