Tripura : త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ రాజీనామా..!
Tripura : త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాను గవర్నర్ ఎస్ఎన్ ఆర్యకు సమర్పించారు.;
Tripura : త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాను గవర్నర్ ఎస్ఎన్ ఆర్యకు సమర్పించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన అనంతరం దేబ్ ఈ విషయాన్ని ప్రకటించారు. హైకమాండ్ అదేశాలతోనే ఆయన రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది.. బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఇవ్వాలే కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు.
బీజేపీ శాసనసభా పక్ష సమావేశానికి కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్, బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేలను పరిశీలకులుగా నియమించారు. కాగా దాదాపు 25 ఏళ్ల లెఫ్ట్ ఫ్రంట్ పాలనకు ముగింపు పలికి, తొలిసారిగా రాష్ట్రంలో ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపిఎఫ్‌టి)తో పొత్తుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.. 2018లో దేబ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఇక వచ్చే ఏడాది ప్రారంభంలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.