Chhattisgarh: చత్తీస్‌గడ్ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
Chhattisgarh: ఆంధ్ర, చత్తీస్‌గడ్ సరిహద్దుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు.;
Chhattisgarh: ఆంధ్ర, చత్తీస్‌గడ్ సరిహద్దుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. కంకేర్ జిల్లా పరిధిలోని సిక్సోడ్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో 81వ కార్ప్స్, బీఎస్‌ఎఫ్ దళాలు తనిఖీలు చేపట్టారు.
సిక్సోడ్ నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఎన్ కౌంటర్ అనంతరం పెద్దయెత్తున మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
చనిపోయిన మావోయిస్టులు డీవీసీ దర్శన్ పెద్దా, పార్తాపూర్ ఏరియా కార్యదర్శికాగా.. నార్త్ బ్యూరో యాక్షన్ టీమ్ కమాండర్ జగేష్ సలాంగా గుర్తించారు. వీరిపై హత్య,దోపిడీ,దహనం వంటి కేసులు ఉన్నట్లు తెలిపారు.