Chennai : చెన్నైలోనూ ఒమిక్రాన్ కేసులు .. ఇద్దరు వ్యక్తులకు పాజిటివ్
Chennai : చెన్నైలోనూ ఒమిక్రాన్ కలవరం మొదలైంది. సింగపూర్ నుంచి తిరుచిరాపల్లి ఎయిర్‌పోర్టుకు వచ్చిన వ్యక్తితో పాటు యూకే నుంచి చెన్నై వచ్చిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది.;
Chennai : చెన్నైలోనూ ఒమిక్రాన్ కలవరం మొదలైంది. సింగపూర్ నుంచి తిరుచిరాపల్లి ఎయిర్‌పోర్టుకు వచ్చిన వ్యక్తితో పాటు యూకే నుంచి చెన్నై వచ్చిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. తిరుచిరాపల్లి వచ్చిన వ్యక్తిని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్స్ కోసం చెన్నై సహా బెంగళూరుకు పంపినట్లు చెప్పారు తమిళనాడు హెల్త్ మినిస్టర్ సుబ్రమణియన్. యూకే నుంచి చెన్నై వచ్చిన వ్యక్తిని కింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ హాస్పిటల్ స్పెషల్ వార్డులో అడ్మిట్ చేశారు. శాంపిల్స్ జినోమ్ సీక్వెన్స్ కోసం పంపినట్లు చెప్పారు.