Viral News: భార్యను దోమలు కుడుతున్నాయని పోలీసులకు భర్త కంప్లైంట్..

Viral News: ప్రసవానంతర వేదనతో పాటు తన భార్య దోమ కాటు వల్ల అదనపు నొప్పిని కూడా భరిస్తోందని భర్త ట్వీట్ చేశాడు.;

Update: 2023-03-23 05:40 GMT

Viral News: 'మాఫియా'లను వదిలించుకోవడం నుండి రాష్ట్రంలో ప్రజలను ఇబ్బంది పెడుతున్న దోమల వరకు, యూపి పోలీసులు అన్నింటినీ పరిష్కరించగలరని ప్రజలకు ఈ సంఘటన ద్వారా తెలియజేశారు. యూపి పోలీసులు దోమల నివారణ మందును పంపిణీ చేసిన తాజా సంఘటన, రాష్ట్రంలోని సిబ్బంది తమ వృత్తిపరమైన కట్టుబాట్లను మించి ప్రజలకు ఎలా సహాయం చేస్తారో తెలియజెబుతోంది. యూపిలోని చందౌసిలోని ఒక ఆసుపత్రిలో ఆడబిడ్డను ప్రసవించిన ఒక మహిళ భర్త, తన భార్య ప్రసవానంతర వేదనతో పాటు దోమలు కుట్టి తనని, తన చిన్నారిని ఇబ్బంది పెడుతున్నాయని సంభాల్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయాన్ని యూపీ పోలీసులకు ట్వీట్ చేశాడు.

“నా భార్య ఈరోజు హరి ప్రకాష్ నర్సింగ్ హోమ్ చందౌసిలో బిడ్డకు జన్మనిచ్చింది. కానీ నా భార్య ఇక్కడ చాలా ఇబ్బంది పడుతోంది, ప్రసవానంతర బాధ ఒక పక్క అయితే, మరోపక్క దోమలు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాయి. నేను బయటకు వెళ్లి దోమల నివారణ కాయిల్స్ కోసం ప్రయత్నించాను.. కానీ దగ్గరలో ఎక్కడా దొరకలేదు. దయచేసి నాకు అత్యవసరంగా మోర్టిన్ కాయిల్ అందించండి!" అని సంభాల్ పోలీసులకు ట్వీట్ చేశాడు. UP పోలీసులు వెంటనే స్పందించి PRVకి సంబంధించిన ఇద్దరు సిబ్బందితో దోమల కాయిల్స్‌ను ఆస్పత్రికి పంపించింది. అది చూసి సంభాల్ ఆశ్చర్యపోయాడు.. వెంటనే స్పందించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. యూపీ పోలీసుల మానవత్వంతో వ్యవహరించినందుకు నెటిజన్లు అభినందిస్తున్నారు.

Tags:    

Similar News