Yogi Adityanath : ఐదేళ్ల తరువాత సొంతూరుకు... తల్లి ఆశీస్సులు తీసుకున్న యోగి..!

Yogi Adityanath : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం మూడు రోజుల పర్యటనలో భాగంగా ఉత్తరాఖండ్ వచ్చారు..

Update: 2022-05-04 10:02 GMT

Yogi Adityanath : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం మూడు రోజుల పర్యటనలో భాగంగా ఉత్తరాఖండ్ వచ్చారు.. ఉత్తరాఖండ్ లోని తన స్వంతగ్రామమైన పౌరీకి చేరుకొని తన తల్లి సావిత్రిదేవిని కలుసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమె పాదాలకు యోగి నమస్కరిస్తున్న ఫోటోను యోగి స్వయంగా ట్విట్టర్‌లో షేర్ చేశారు. సీఎం అయ్యాక తొలిసారి తన తల్లిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు యోగి.

బుధవారం తన కుటుంబంలో జరగబోయే ఓ వేడుకకు యోగి హాజరయ్యారు. తన మేనల్లుడి తలవెంట్రుకలు తీసే కార్యక్రమంలో పాల్గొంటారు. సొంతపని మీద వెళ్ళడం ఆయనకీ ఇదే మొదటిసారి. కరోనా సమయంలో తన తండ్రి ఆనంద్ సింగ్ బిష్త్ చనిపోయినప్పుడు అంత్యక్రియలకి కూడా యోగి హాజరు కాలేదు. ఇక కుటుంబానికి కలవడానికి ముందు యోగి తన సొంత జిల్లా పౌరీ-గర్వాల్‌లోని మహాయోగి గురు గోరఖ్‌నాథ్ ప్రభుత్వ కళాశాలలో తన ఆధ్యాత్మిక గురువు మహంత్ వైద్యనాథ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా యోగి ఉద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ , కేబినెట్ మంత్రులు సత్పాల్ మహరాజ్, ధన్ సింగ్ రావత్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుండగా, ఆయన మే 5న హరిద్వార్‌లో పర్యటించి ఎన్‌హెచ్-58 సమీపంలో గంగా కాలువకు ఆనుకుని కొత్తగా నిర్మించిన భగీరథి హోటల్‌ను ప్రారంభించనున్నారు. ఈ హోటల్‌ను ఉత్తరప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ నిర్మించింది.

Tags:    

Similar News