ఉత్తరాఖండ్‌లో జలప్రళయం.. పులకరించిపోయిన కార్మికుడు దృశ్యం వైరల్

బయటకు వచ్చిన ఓ కార్మికుడు సంతోషంతో పులకరించిపోయిన దృశ్యం అక్కడి వారిని కదిలించింది.

Update: 2021-02-08 03:15 GMT

దేవభూమి ఉత్తరాఖండ్‌లో మరోసారి జలప్రళయం బీభత్సం సృష్టించింది. నందాదేవి హిమానీనదిలో ఓ భాగం కట్టలు తెచ్చుకోవడంతో చమోలీ జిల్ఆలా రేనీ తపోవన్ వద్ద రిషి గంగానదికి ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ వరదల్లో 13.2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రిషిగంగా జలవిద్యుత్ ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోయింది. ధౌలీ గంగానది సంగమం వద్ద ఉన్న ఎన్టీటీపీ ప్రాజెక్టు పాకికంగా దెబ్బతింది. ఈ ప్రాజెక్టులో ఈ ప్రాజెక్టులో పనిచేస్తోన్న 170 మంది కార్మికులు గల్లంతు కాగా.. ఏడుగురు మృతిచెందినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది.

ఇప్పటివరకు 16 మందిని సురక్షితంగా కాపాడాయి. పవర్ ప్రాజెక్టు టన్నెల్ లో చిక్కుకుపోయిన కార్మికులను బయటకు తీశారు. ప్రాణాలతో బయటపడిన వారందరికీ చికిత్స అందిస్తున్నారు. ఈ సమయంలో బయటకు వచ్చిన ఓ కార్మికుడు సంతోషంతో పులకరించిపోయిన దృశ్యం అక్కడి వారిని కదిలించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ విషాద ఘటనలో మృతిచెందిన కుటుంబాలకు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. బాధితుల్లో ఒక్కో కుటుంబానికి 4లక్షల రూపాయల పరిహారం ఇవ్వనున్నట్లు సీఎం త్రివేంద్ర సింగ్ తెలిపారు. ప్రస్తుతానిని నీటి స్థాయి కట్టడి అయిందని.. గ్రామాలు, పవర్ ప్రాజెక్టులకు వరద ముప్పు లేదని ఆయన స్పష్టంచేశారు. చమోలీ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు.

ఈ ఘటనపై రాష్ట్రపతి రామ్ నాథ్‌ కోవింద్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. ప్రజలు సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ కూడా విచారం వ్యక్తంచేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ ఘటనపై స్పందించారు. సహాయక చర్యల్లో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ విషాద సమయంలో ఉత్తరాఖండ్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.


Tags:    

Similar News