Vaccine for Children: 12 ఏళ్ల లోపు చిన్నారులకు వ్యాక్సిన్..

Vaccine for Children: ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో చిన్నారులకు టీకా వేస్తున్నప్పటికీ భారీ స్థాయిలో ఎక్కడా వ్యాక్సినేషన్ జరగలేదని మంత్రి అన్నారు.

Update: 2021-12-21 11:00 GMT

Vaccine for Children: కరోనా తగ్గింది కదా అనుకుంటే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వచ్చి బడికి వెళ్లే చిన్నారులను భయపెడుతోంది. వ్యాక్సిన్‌తో పెద్ద వాళ్లకు కొద్దో గోప్పో రక్షణ. మరి చిన్నపిల్లల పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. వారిలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగానే ఉంటుందని భావించి వ్యాక్సినేషన్ వాయిదా పడుతూ వస్తోంది. ఈ విషయంపై ప్రభుత్వం విస్తృతంగా చర్చలు జరుపుతోంది. 12 ఏళ్లలోపు చిన్నారులకు వ్యాక్సిన్ అంత అత్యవసరం ఏమీ కాదని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఇన్ ఇమ్యునైజేషన్ సభ్యుడు ఒకరు తాజాగా ఓ జాతీయ మీడియాతో అన్నారు.

భారత్‌లో 12 ఏళ్ల లోపు చిన్నారుల్లో కోవిడ్ మరణాలు నమోదు కాలేదు. ఈ వయసు వారిలో కొందరికి కరోనా సోకినప్పటికీ తీవ్రత తక్కువగానే ఉంది. దాంతో వారికి వ్యాక్సినేషన్ విషయంలో తొందర పడాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. నిపుణుల సూచన మేరకే చిన్నారులకు వ్యాక్సిన్ గురించి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో చిన్నారులకు టీకా వేస్తున్నప్పటికీ భారీ స్థాయిలో ఎక్కడా వ్యాక్సినేషన్ జరగలేదని మంత్రి అన్నారు.

ఇదిలా ఉంటే భారత్ అభివృద్ధి చేసిన జైకోవ్ డి టీకాను 12 ఏళ్లు దాటిన చిన్నారులకు ఇచ్చేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దీని పంపిణీ గురించి కేంద్రం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. 

Tags:    

Similar News