Vinesh Phoghat: న్యాయం కావాలి...
రెండో రోజు కొనసాగుతున్న రెజ్లర్ల నిరసనలు; వినేశ్ ఫొగట్ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఆందోళన; WFI ప్రెసిడెంట్‌తో పాటు కొందరు కోచ్‌లు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణ..;
ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర రెజ్లర్ల ఆందోళన రెండో రోజూ కొనసాగుతోంది.. రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఆధ్వర్యంలో ఈ నిరసనలు జరుగుతున్నాయి. భారత రెజ్లింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ బ్రిజ్‌భూషణ్ తో పాటు కొందరు కోచ్‌లు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని వినేశ్ ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ 72 గంటల్లో వివరణ ఇవ్వాలని రెజ్లింగ్ ఫెడరేషన్‌ను ఆదేశించింది.
మరోవైపు లక్నోలో జరగాల్సిన నేషనల్ ఉమెన్ రెజ్లింగ్ కోచింగ్ క్యాంపును స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. ఈ క్యాంప్‌లో దాదాపు 41 మంది రెజ్లర్లు, 3 మంది కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్ పాల్గొనాల్సి ఉంది. అయితే కోచ్‌లపై లైంగిక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో క్యాంప్‌ను రద్దు చేస్తున్నట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది.