Weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
Weather Report: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో.. తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతారవణ శాఖ తెలిపింది.;
Weather Report: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో.. తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతారవణ శాఖ తెలిపింది. రేపటి వరకు పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి.. వాయుగుండంగా మారుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టం చేసింది. 24గంటల్లో గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయటమేగాక, కెరటాల ఉద్ధృతి ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా కోస్తా, రాయలసీ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. మరోవైపు పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
అటు కర్ణాటక రాజధాని బెంగళూరును మరోసారి భారీ వాన ముంచెత్తింది. సిటీలోని రోడ్లన్నీ చెరువులను తలపించేలా మారాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి నీరుచేరడంతో వాహనాలు దెబ్బతిన్నాయి. రాజమహల్ గుట్టహళ్లి ప్రాంతంలో 59 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
వైట్ ఫీల్డ్, మహదేవపుర, బొమ్మనహళ్లి ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. అటు మరో రెండ్రోజులపాటు మహానగరంలో భారీ వర్షాలు కరుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎల్లో అలర్ట్‌ని ప్రకటించింది. భారీవర్షానికి నగరంలోని అన్నిప్రాంతాల్లో వరద పోటెత్తింది.