Mamata Banerjee : ప్రధాని మోదీతో సీఎం మమతా బెనర్జీ సమావేశం..!
Mamata Banerjee : సరిహద్దు భద్రతా దళం అధికార పరిధి నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు.;
Mamata Banerjee : సరిహద్దు భద్రతా దళం అధికార పరిధి నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమైన దీదీ.. బెంగాల్ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు బీఎస్ఎఫ్ అధికార పరిధి విస్తరణపై చర్చించారు. గతంలో భారత్-పాకిస్తాన్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ అధికార పరిధిని కేంద్రం విస్తరించింది. అంతర్జాతీయ బోర్డర్‌ల నుంచి భారత దేశం వైపు 50 కిలోమీటర్ల వరకు సోదాలు నిర్వహించేందుకు అనుమతిచ్చింది. అనుమానితులను అరెస్టు చేయడంతో పాటు వస్తువులను స్వాధీనం చేసుకునేందుకు అధికారం కల్పించింది కేంద్రం. అయితే ఈ నిబంధనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఇటీవల తీర్మానం చేసింది. ఇదే అంశంపై ప్రధాని మోదీతో చర్చించిన మమతా బెనర్జీ.. కేవలం సామాన్యులను వేధించడానికే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు.