Aparna Singh Yadav: మామగారికి షాక్ ఇచ్చిన చిన్నకోడలు.. ఎవరీ అపర్ణా యాదవ్

Aparna Singh Yadav: మాంచెస్టర్ విశ్వవిద్యాలయం నుండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పాలిటిక్ నుంచి మాస్టర్స్ డిగ్రీ చేసింది.

Update: 2022-01-19 09:58 GMT

Aparna Singh Yadav: సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కోడలు అన్ని ఊహాగానాలకు స్వస్తి పలికి ఈరోజు (జనవరి 19, 2022) భారతీయ జనతా పార్టీలో చేరడంతో ఉత్తరప్రదేశ్ పోరు మరింత ఆసక్తికరంగా మారింది.

ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, ఆ రాష్ట్ర చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. అపర్ణా యాదవ్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ విధివిధానాలు తనను ఆకట్టుకున్నాయని అందుకే బీజేపీలో చేరానని అన్నారు. దేశ ప్రయోజనాలే తన మొదటి ప్రాధాన్యత అని అన్నారు.

అపర్ణా యాదవ్ గురించి ఇక్కడ కొన్ని వివరాలు ఉన్నాయి:



- ములాయం సింగ్ యాదవ్ రెండవ భార్య సాధన గుప్తా కుమారుడు ప్రతీక్ యాదవ్‌ను అపర్ణ వివాహం చేసుకున్నారు. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మొదటి భార్య కుమారుడు. 2011లో పెళ్లి చేసుకున్న అపర్ణ, ప్రతీక్ దంపతులకు ఓ కూతురు ఉంది. భర్త ప్రతీక్‌కి రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కానీ అపర్ణకు పాలిటిక్స్ అంటే ఇంట్రస్ట్.. ఆ కారణంగానే 2017 అసెంబ్లీ ఎన్నికలలో సమాజ్‌వాదీ పార్టీ తరపున లక్నో కాంట్ నుండి పోటీ చేసింది. కానీ అప్పుడు బిజెపికి చెందిన లోక్‌సభ సభ్యురాలు రీటా బహుగుణ జోషి చేతిలో ఓడిపోయింది.

- ఆమె మాంచెస్టర్ విశ్వవిద్యాలయం నుండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పాలిటిక్ నుంచి మాస్టర్స్ డిగ్రీ చేసింది. అపర్ణ bAware అనే మహిళా న్యాయవాది సంస్థను నిర్వహిస్తోంది, రాష్ట్రంలో మహిళలకు విద్య మరియు సాధికారత కల్పించే దిశగా పని చేస్తోంది. అపర్ణా యాదవ్ తండ్రి అరవింద్ సింగ్ బిష్త్ జర్నలిస్టు. ఆయన ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. అపర్ణ తల్లి అంబి బిష్త్ లక్నో మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్నారు.

- గతంలో చాలా సార్లు, ఆమె బిజెపి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రశంసించారు. ఆర్టికల్ 370 రద్దుకు మద్దతు ఇవ్వడం నుండి సమాజ్ వాదీ పార్టీ వ్యతిరేకించిన జాతీయ పౌర రిజిస్టర్‌కు మద్దతు ఇవ్వడం వరకు - ఆమె బీజేపీలోకి చేరుతున్నట్లు సిగ్నల్స్ పాస్ చేస్తూనే ఉంది.. తాజాగా సస్పెన్స్‌కు తెరదించి బీజేపీ జెండా పట్టుకున్నారు అపర్ణ. 

Tags:    

Similar News