పర్యావరణవేత్తల మెడకు చుట్టుకుంటున్న'టూల్‌కిట్' రగడ
నికితా జాకబ్, శంతనులపై పోలీసుల విజ్ఞప్తి మేరకు ఢిల్లీ న్యాయస్థానం నాన్‌బెయిలబుల్ వారెంటు జారీ చేసింది.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనల చేస్తున్నరైతులకు మద్దతుగా.. ప్రఖ్యాత పర్యావరణవేత్త గ్రెటా థన్‌బర్గ్.. ట్వీట్ల తర్వాతి పరిణామాలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. గ్రెటా థన్‌బర్గ్ షేర్ చేసిన.. టూల్‌కిట్ కేసు దర్యాప్తులో భాగంగా మరో ఇద్దరు సామాజిక కార్యకర్తలపై ఢిల్లీ పోలీసులు అరెస్టు వారెంటు జారీ చేశారు. పర్యావరణ ప్రేమికురాలు గ్రెటాథన్‌బర్గ్ టూల్‌కిట్ ట్వీట్ చేసిన వ్యవహారంతో సంబంధం ఉందనే ఆరోపణల నేపథ్యంలో నికితా జాకబ్, శంతనులపై పోలీసుల విజ్ఞప్తి మేరకు ఢిల్లీ న్యాయస్థానం నాన్‌బెయిలబుల్ వారెంటు జారీ చేసింది. అయితే, ఇద్దరిలో నికితా జాకబ్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 11న నికితా జాకబ్ ఇంటికి ప్రత్యేక బృందం వెళ్లింది. అయితే.. సాయంత్రం వేళ కావడంతో ఆమెను అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. అప్పుడు పలు పత్రాలపై సంతకం చేసిన అనంతరం.. తాను విచారణలో పాల్గొంటానని నికిత అధికారులకు చెప్పారనీ.. ఆ తర్వాత ఆమె అజ్ఞాతంలోకి వెళ్లినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
గ్రెటా థన్‌బర్గ్.. టూల్‌కిట్ కేసులో భాగంగా ఇప్పటికే బెంగళూరుకు చెందిన పర్యావరణ కార్యకర్త దిశ రవిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ టూల్‌కిట్‌ను ఆమె గ్రెటా థన్‌బర్గ్‌తో పంచుకున్నారనే ఆరోపణలతో అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా.. ఐదురోజుల పోలీసు కస్టడీకి తరలించారు. ఆ టూల్‌కిట్‌ను తాను తయారుచేయలేదని దిశ కన్నీరు పెట్టుకున్నట్టు సమచారం. అయితే.. ఆమె అరెస్టును సంయుక్త కిసాన్ మోర్చా తీవ్రంగా ఖండించింది. తక్షణం ఆమెను విడుదల చేయాలని డిమాండు చేసింది.
స్వీడన్‌కు చెందిన పర్యావరణ ప్రేమికురాలు గ్రెటా థన్‌బర్గ్ షేర్ చేయడంతో ఈ టూల్‌కిట్ వెలుగులోకి వచ్చింది. రైతుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు ఉన్న వివిధ మార్గాలను సూచిస్తూ గూగుల్ డాక్యూమెంట్ సృష్టించారు. దీనికి టూల్‌కిట్‌గా నామకరణం చేశారు. అయితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖలిస్థాన్ వేర్పాటువాదులే దీన్ని రూపొందించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ టూల్‌కిట్‌కు సంబంధించి గుర్తుతెలియని వ్యక్తులపై ఢిల్లీ పోలీసులు దేశద్రోహం, ప్రభుత్వంపై కుట్రకు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రైతుల ఆందోళనల ప్రణాళిక టూల్‌కిట్‌ను షేర్ చేసిన కేసులో పర్యావరణ కార్యకర్త దిశ రవిని అరెస్టును ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఖండించారు. ఈ అరెస్టు ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ఆయన పేర్కొన్నారు.