Prakash Javadekar : డిసెంబర్ నాటికి అందరికీ వ్యాక్సిన్ : ప్రకాశ్ జావడేకర్
Prakash Javadekar : దేశంలో డిసెంబర్ చివరి నాటికి వ్యాక్సినేషన్ పూర్తి అవుతుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు. మొత్తం 216కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయన్నారు.;
Prakash Javadekar : దేశంలో డిసెంబర్ చివరి నాటికి వ్యాక్సినేషన్ పూర్తి అవుతుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు. మొత్తం 216కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయన్నారు. 108 కోట్ల మందికి టీకా ఇవ్వాలనే ప్రణాళిక పూర్తి అయిందని అన్నారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్ తో పాటు జైడస్, నొవావాక్, జినోవా, టీకాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పైన ఆయన విమర్శలు గుప్పించారు. ముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలని సూచించారు. కాగా అటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1.86 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కానీ మరణాల సంఖ్య తగ్గకపోవడం ఆందోళనకి గురిచేస్తోంది. ప్రస్తుతం దేశంలో 24.4 లక్షలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి.