Akhilesh Yadav : వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను..!
Akhilesh Yadav : ఉత్తర్ ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ...సంచలన ప్రకటన చేశారు సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్.;
Akhilesh Yadav : ఉత్తర్ ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ...సంచలన ప్రకటన చేశారు సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తానూ పోటీ చేయట్లేదని ప్రకటన చేశారు. మరో వైపు రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీతో పొత్తు కూడా కుదిరిందని చెప్పారు. ఐతే ఇంకా సీట్ల పంపకాలు పూర్తి కావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం అజాంఘర్ నుంచి ఎంపీగా ఉన్నారు అఖిలేష్ యాదవ్. 2012 నుంచి 17 మధ్య ఉత్తర్ ప్రదేశ్ సీఎంగా పని చేశారు అఖిలేష్ యాదవ్. ఆ సమయంలో ఎమ్మెల్సీగా ఉన్నారు.