Yellow Alert : ఢిల్లీలో 'ఎల్లో అలర్ట్'..!
Yellow Alert : : ఒమిక్రాన్ వేరియంట్ దేశ రాజధాని ఢిల్లీలో దడ పుట్టిస్తోంది. మహారాష్ట్రను దాటి అత్యధిక కేసులతో దిల్లీ దేశంలో తొలి స్థానానికి చేరింది.;
Yellow Alert : ఒమిక్రాన్ వేరియంట్ దేశ రాజధాని ఢిల్లీలో దడ పుట్టిస్తోంది. మహారాష్ట్రను దాటి అత్యధిక కేసులతో దిల్లీ దేశంలో తొలి స్థానానికి చేరింది. అంతకంతకు పెరుగుతున్న కేసులతో అప్రమత్తమైన ఆప్ సర్కార్...దిల్లీ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటివరకు 165 కొత్త వేరియంట్ కేసులు వెలుగుచూడటంతో... ఢిల్లీలో మరిన్ని ఆంక్షలను విధిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. దిల్లీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. బాధితుల వ్యాధి తీవ్రత స్వల్పంగానే ఉందని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు గతంలో కంటే 10 రెట్లు ఎక్కువ సిద్ధంగా ఉన్నట్లు సర్కార్ వెల్లడించింది. ప్రజలంతా కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, మాస్క్‌లు, భౌతికదూరం వంటివి మరవొద్దని విజ్ఞప్తి చేసింది. ఢిల్లీలో సినిమా హాళ్లు, మల్టిప్లెక్స్‌లు, ఆడిటోరియంలను పూర్తిగా మూసివేస్తున్నట్లు తెలిపారు. జిమ్‌లు, స్పా సెంటర్లు, యోగా ఇనిస్టిట్యూట్‌లను బంద్ పడనున్నాయి. అటు స్కూళ్లు, విద్యా సంస్థలు, కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లను మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో సామాజిక, రాజకీయ, మతపరమైన సామూహిక కార్యక్రమాలు, సభలు, సమావేశాలపై నిషేధం విధించారు. పెళ్లిళ్లు, అంతిమ సంస్కారాలకు 20 మందికి మాత్రమే అనుతి ఇచ్చారు.
అలాగే రెస్టారెంట్లను 50శాతం సామర్థ్యంతో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు తెరుచుకోవచ్చని స్పష్టం చేశారు. బార్లను 50శాతం సామర్థ్యంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని ఆదేశాలిచ్చారు. ఇక ఆటోలు, క్యాబ్ లలో ఇద్దరు మాత్రమే ప్రయాణించడానికి అనుమతి ఇచ్చారు. దుకాణ సముదాయాలు, మాల్స్ లో దుకాణాలు సరి, బేసి విధానంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చు.