China: చైనాలో కుప్పకూలిన బోయింగ్ 737 విమానం.. 133 మంది గల్లంతు..
China: 133 మందితో వెళ్తున్న బోయింగ్ 737 విమానం గుయాంగ్‌ఝౌ ప్రాంతంలో కుప్పకూలింది.;
China: చైనాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 133 మందితో వెళ్తున్న బోయింగ్ 737 విమానం గుయాంగ్‌ఝౌ ప్రాంతంలో కుప్పకూలింది. కున్మింగ్ నుంచి గుయాంగ్‌ఝౌ నగరానికి బయల్దేరిన కాసేపటికే చైనా ఈస్ట్రన్ సంస్థకు చెందిన విమానానికి రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. పర్వత ప్రదేశంలో విమానం కుప్పకూలడంతో మంటలు చెలరేగాయి. వెంటనే రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది.
ప్రమాద సమయంలో విమానం 3వేల 225 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వద్ద సమాచారం ఉంది. 376 నాట్ల వేగంతో ప్రయాణించినట్లు తెలుస్తోంది. గుయాంగ్‌ఝౌ ప్రాంతంలోని వుజౌ నగర సమీపంలో పర్వతాన్ని ఢీకొట్టి కూలినట్లు అనుమానిస్తున్నారు. 2010లో చైనాలో కూలిన విమాన ప్రమాదంలో 44 మంది మరణించారు. ప్రయాణ సమయంలో అందులో 96 మంది ఉన్నారు. హెనాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం యిచున్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటుండగా ఘటన జరిగింది.