Rishi Sunak : ప్రీతి పటేల్ తప్పుకోవడంతో.. రిషి సునక్‌కు లైన్ క్లీయర్..
Rishi Sunak : బ్రిటన్ ప్రధాని పదవి అభ్యర్ధి రేసులో ఈ రోజు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.;
Rishi Sunak : బ్రిటన్ ప్రధాని పదవి అభ్యర్ధి రేసులో ఈ రోజు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. బ్రిటన్ హోం సెక్రటరీ తాను ప్రధాని పదవి రేసులో లేను అని తాజాగా ప్రకటించడంతో రిషి సునక్‌కు ప్రధాని అయ్యేందుకు దారి సుగమం అయింది.
ప్రస్తుతం బ్రిటన్ ప్రభుత్వ క్యాబినెట్ రాంకుల్లో ప్రీతి పటేల్ కూడా కీలకంగా వ్యవహించారు. కన్జర్వేటివ్ పార్టీ నుంచి ప్రీతి పటేల్ కూడా ప్రధాని పదవి రేసులో ఉంటుందని అంతా అనుకున్నారు. తాజా ప్రకటణ ఇప్పుడు రిషి సునక్ అభిమానులకు ఊరట కలిగించింది.
రిషి సునక్‌కు అక్కడి కొందరు నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. ఉప ప్రధాని డోమినిక్ రాబ్, రవాణా శాఖ మంత్రి గ్రాంట్ షాప్‌లు రిషి ప్రచార ఈవెంట్‌ను లాంచ్ చేశారు.