Britain: ఐసోలేషన్, హోమ్ క్వారంటీన్‌లాంటి నిబంధనలు ఇక ఉండవు..!
Britain: ప్రస్తుతం కోవిడ్ సోకిన వారు ఎక్కువశాతం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. కానీ ఆ దేశంలో ఈ నిబంధలనలు కూడా ఎత్తివేయబోతోంది.;
Britain: కోవిడ్ బారిన పడిన వారు చికిత్సకంటే ముందుగా క్వారంటీన్‌లో ఉంటారు. 14 రోజులు అలా ఉంటేనే వారికి వచ్చిన కరోనా మరొకరికి సోకకుండా ఉంటుందని వైద్యులు ఇప్పటికే వెల్లడించారు. క్వారంటీన్‌లో ఉన్నప్పటికీ ఆరోగ్యం క్షీణిస్తే.. అప్పుడు వారు ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలి. ఈ రూల్స్ విషయంలో ప్రపంచమంతా ఇప్పటివరకు ఒక్కటిగా నడుస్తోంది. కానీ ఒక దేశం మాత్రం వీటిని చెరిపేయడానికి సిద్ధమవుతోంది.
ఒకానొక సమయంలో కరోనా వల్ల విసిగిపోయిన దేశాలు లాక్‌డౌన్‌ను పక్కన పెట్టి కరోనాతో సహజీవనం తప్పదని స్టెట్‌మెంట్స్ ఇచ్చేశాయి. అయినా కూడా సెకండ్ వేవ్ సమయంలో మరోసారి లాక్‌డౌన్ పెట్టక తప్పలేదు. కానీ థర్డ్ వేవ్ సమయంలో మాత్రం లాక్‌డౌన్ జోలికి వెళ్లవద్దని అందరూ నిర్ణయించుకుని ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం కోవిడ్ సోకిన వారు ఎక్కువశాతం ఐసోలేషన్‌లో, హోమ్ క్వారంటిన్‌లో ఉంటున్నారు. కానీ ఆ దేశంలో ఈ నిబంధలనలు కూడా ఎత్తివేయబోతోంది.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే అందులో వ్యాక్సిన్ వల్ల దాదాపు కరోనా అనేది ప్రజలను ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చేసింది అన్నారు. అంతే కాకుండా ఇకపై కరోనాతో సహజీవనం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించనున్నట్టుగా పరోక్షంగా తెలిపారు.
వైరస్‌తో కలిసి బ్రతకడమే మార్గమని బోరిస్ జాన్సన్ అన్నారు. అయితే స్వేచ్ఛగా తిరగాల్సిన ప్రజలు కోవిడ్ ఆంక్షల వల్ల ఇబ్బందులు పడుతున్నారని, అందుకే వాటిని సడలించాలని ఆయన తెలిపారు. అయితే కోవిడ్ ముఖ్యమైన నిబంధనలను సడలించడంపై వైద్యులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీ నుండి కూడా జాన్సన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.