Donald Trump: టెక్సాస్ కాల్పుల ఘటనపై ట్రంప్ స్పందన.. బైడెన్‌పై విమర్శలు

Donald Trump: అమెరికాలోని స్కూళ్లలో భ‌ద్రతను పెంచేందుకు నిధుల‌ను కేటాయించాల‌ని జో బైడెన్‌‌ను కోరారు డోనాల్డ్ ట్రంప్.

Update: 2022-05-28 09:45 GMT

Donald Trump: అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల మోత అనేది కొత్తేమీ కాదు.. కానీ అక్కడి ప్రభుత్వం మాత్రం దీని గురించి ఎప్పుడూ సీరియస్‌గా తీసుకొని.. ఇలాంటి ఘటనలు ఇకపై జరగకుండా ఆపై ప్రయత్నం చేయలేదు. అందుకే ఇటీవల జరిగిన టెక్సాస్‌లోని స్కూల్ కాల్పుల్లో కూడా 19 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఈ విషయం రాజకీయంగా కూడా ఎన్నో అలజడులను సృష్టిస్తోంది. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా దీనిపై స్పందించారు.

టెక్సాస్‌లో మృతిచెందిన విద్యార్థులకు అధ్యక్షుడు జో బైడెన్ సంతాపం తెలియజేశారు. అంతే కాకుండా వారి కుటుంబాలకు అండగా నిలబడతానన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని మాటిచ్చాడు. కానీ నిందితుడు రామోస్‌.. కాల్పులకు తెగబడడానికి ముందే ఫేస్‌బుక్‌లో దీని గురించి పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. తాజాగా ఈ ఘటనపై ట్రంప్ ఘాటుగానే స్పందించారు.

అమెరికాలోని స్కూళ్లలో భ‌ద్రతను పెంచేందుకు నిధుల‌ను కేటాయించాల‌ని జో బైడెన్‌‌ను కోరారు డోనాల్డ్ ట్రంప్. మన పిల్లలను కాపాడుకునేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. అంతే కాకుండా తుపాకీ చట్టాలను వ్యతిరేకించారు ట్రంప్. తమను తాము కాపాడుకునేందుకు మాత్రమే ఆయుధాలు ఉపయోగించాలని అన్నారు. చివరిగా ఉక్రెయిన్‌లాంటి దేశాలకు పంపించడానికి అమెరికా దగ్గర 40 బిలియన్ డాలర్లు ఉన్నాయి కాబట్టి ఇంటి దగ్గర ఉన్న మన పిల్లల్ని మాత్రం మనం సురక్షితంగా చూసుకోవడానికి కూడా మనం ఏదైనా చేయాలి బైడెన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు ట్రంప్.


Tags:    

Similar News