Gaddam Meghana: 18 ఏళ్ల ప్రకాశం జిల్లా అమ్మాయి.. న్యూజిలాండ్‌లో ఎంపీ అయ్యింది..

Gaddam Meghana: కేంబ్రిడ్జిలోని సెయింట్‌ పీటర్స్‌ హై స్కూల్‌లో ప్రాథమిక చదువును పూర్తిచేసుకుంది మేఘన.

Update: 2022-01-17 03:15 GMT

Gaddam Meghana (tv5news.in)

Gaddam Meghana: కృషి, పట్టుదల ఉండే వయసుతో సంబంధం లేదని ఇప్పటికీ ఎంతోమంది మనకు నిరూపించారు. ఇప్పుడు మరోసారి అదే మాటను నిజం చేసి చూపించింది 18 ఏళ్ల ప్రకాశం జిల్లా అమ్మాయి మేఘన. ఏకంగా న్యూజిలాండ్‌లో ఎంపీగా బాధ్యతలు స్వీకరించనుంది. ఇండియా ఒరిజిన్ అయ్యిండి న్యూజిలాండ్‌లో ఎంపీ కానున్న మేఘన గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మేఘనది గుంటూరు జిల్లా టంగుటూరు. తన తండ్రి గడ్డం రవికుమార్‌ 2001లో న్యూజిలాండ్ వెళ్లి సెటిల్ అయ్యారు. అక్కడే మేఘన పుట్టింది. మేఘన ఒక న్యూజిలాండ్ సిటిజన్‌గానే పెరిగింది. కేంబ్రిడ్జిలోని సెయింట్‌ పీటర్స్‌ హై స్కూల్‌లో ప్రాథమిక చదువును పూర్తిచేసుకుంది. స్కూల్ డేస్ నుండి ఛారిటీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనే మేఘన.. ప్రస్తుతం న్యూజిలాండ్‌కు 'సేవా కార్యక్రమాలు, యువత' విభాగానికి ఎంపీ అయ్యింది.

వాల్కటో ప్రాంతం నుండి మేఘన ఎంపీగా ఎన్నికయ్యారు. న్యూజిలాండ్‌కు ఇతర దేశాల నుండి వలస వచ్చిన శరణార్థులకు విద్య, ఆశ్రయం, కనీస వసతులు కల్పించడంలో కీలక పాత్ర పోషించింది మేఘన. దీంతో ఆ ప్రభుత్వం తనకు ఈ పదవిని అందించి గౌరవించింది. డిసెంబర్‌ 16న ఈ ఎంపిక జరిగింది. ఫిబ్రవరీలో ఎంపీగా మేఘన ప్రమాణ స్వీకారం చేయనుంది.

Tags:    

Similar News