NARAVANE: నరవణె పుస్తకం వెనుక కుట్ర?

ఫోర్ స్టా­ర్స్ ఆఫ్ డె­స్టి­నీ’ ఆత్మ­కథ చు­ట్టూ ము­సు­రు­కు­న్న వి­వా­దం

Update: 2026-02-13 05:30 GMT

మాజీ సై­న్యా­ధి­ప­తి జన­ర­ల్ ఎం.ఎం. నర­వ­ణె రచిం­చిన ‘ఫోర్ స్టా­ర్స్ ఆఫ్ డె­స్టి­నీ’ ఆత్మ­కథ చు­ట్టూ ము­సు­రు­కు­న్న వి­వా­దం ఇప్పు­డు జా­తీయ స్థా­యి­లో తీ­వ్ర సం­చ­ల­నం రే­పు­తోం­ది. రక్షణ శాఖ నుం­డి ఎటు­వం­టి అధి­కా­రిక ప్ర­చు­రణ అను­మ­తు­లు రా­క­ముం­దే ఈ పు­స్త­కం అమె­రి­కా, కె­న­డా, ఆస్ట్రే­లి­యా, జర్మ­నీ వంటి పలు దే­శా­ల్లో­ని ఆన్‌­లై­న్ వి­క్రయ వే­ది­క­ల­పై ప్ర­త్య­క్ష­మ­వ్వ­డం కల­క­లం సృ­ష్టిం­చిం­ది. ఇది కే­వ­లం సా­ధా­రణ పై­ర­సీ చర్య కా­ద­ని, పక్కా ప్ర­ణా­ళి­క­తో అం­త­ర్జా­తీయ మా­ర్కె­ట్లో­కి పు­స్త­కా­న్ని చే­ర­వే­సే­లా ఒక వ్య­వ­స్థీ­కృత లీక్ ఆప­రే­ష­న్ జరి­గి­న­ట్లు ఢి­ల్లీ పో­లీ­సుల ప్రా­థ­మిక దర్యా­ప్తు­లో వె­ల్ల­డైం­ది. ఈ వ్య­వ­హా­రం వె­నుక ఉన్న కు­ట్ర కో­ణా­న్ని వె­లి­కి­తీ­సేం­దు­కు దర్యా­ప్తు సం­స్థ­లు ఇప్పు­డు రం­గం­లో­కి ది­గా­యి.

ప్ర­భు­త్వ అను­మ­తు­లు లభిం­చ­క­ముం­దే ఈ పు­స్త­కా­ని­కి 13 అం­కెల అం­త­ర్జా­తీయ ప్రా­మా­ణిక పు­స్తక సం­ఖ్య (ISBN) కే­టా­యిం­చ­డం దర్యా­ప్తు బృం­దా­ల­ను వి­స్మ­యా­ని­కి గు­రి­చే­స్తోం­ది. సా­ధా­ర­ణం­గా అన్ని చట్ట­ప­ర­మైన అను­మ­తు­లు పూ­ర్తి చే­సు­కు­ని మా­ర్కె­ట్లో­కి వచ్చే పు­స్త­కా­ల­కే ఈ నం­బ­రు కే­టా­యి­స్తా­రు. రక్షణ శాఖ పరి­శీ­ల­న­లో ఉన్న పు­స్త­కా­ని­కి ఈ నం­బ­రు ఎలా వచ్చిం­ద­న్న­ది ఇప్పు­డు ప్ర­ధాన ప్ర­శ్న­గా మా­రిం­ది. ఈ నే­ప­థ్యం­లో­నే ప్ర­చు­రణ సం­స్థ పెం­గ్వి­న్ ఇం­డి­యా­ను ప్ర­శ్నిం­చేం­దు­కు పో­లీ­సు­లు సి­ద్ధ­మ­య్యా­రు. వి­దే­శీ మా­ర్కె­ట్ల­కు ఈ పు­స్తక కా­పీ­ల­ను పం­ప­డా­ని­కి జరి­గిన డి­జి­ట­ల్ ట్రా­న్సా­క్ష­న్స్, ఆర్థిక లా­వా­దే­వీ­ల­ను పో­లీ­సు­లు ప్ర­స్తు­తం ని­శి­తం­గా ట్రా­క్ చే­స్తు­న్నా­రు. చైనా దళా­ల­తో భారత బల­గాల ఘర్షణ వంటి దేశ భద్ర­త­కు సం­బం­ధిం­చిన అత్యంత సు­న్ని­త­మైన అం­శా­ల­ను నర­వ­ణె ఈ పు­స్త­కం­లో ప్ర­స్తా­విం­చా­రు. వీ­టి­పై రక్షణ మం­త్రి­త్వ శాఖ అభ్యం­త­రా­లు వ్య­క్తం చే­స్తూ ప్ర­చు­ర­ణ­ను ని­లి­పి­వే­యా­ల­ని గతం­లో­నే ఆదే­శిం­చిం­ది. అయి­తే, ఇటీ­వల లో­క్‌­స­భ­లో ప్ర­తి­ప­క్ష నేత రా­హు­ల్ గాం­ధీ ఈ పు­స్త­కా­న్ని ప్ర­ద­ర్శిం­చ­డం­తో ఈ లీ­కే­జీ ఉదం­తం ఒక్క­సా­రి­గా బయ­ట­ప­డిం­ది. దీ­ని­పై ఢి­ల్లీ పో­లీ­సు­లు ఇప్ప­టి­కే ఎఫ్ఐ­ఆ­ర్ నమో­దు చేసి, పెం­గ్వి­న్ ఇం­డి­యా­కు నో­టీ­సు­లు జారీ చే­శా­రు. బా­ధ్యు­ల­పై కఠిన చర్య­లు తీ­సు­కు­నే ది­శ­గా వి­చా­రణ వే­గ­వం­త­మైం­ది. ఈ వ్య­వ­హా­రం­పై స్పం­దిం­చేం­దు­కు రక్షణ మం­త్రి­త్వ శాఖ ని­రా­క­రిం­చి­న­ప్ప­టి­కీ, ని­బం­ధ­నల ఉల్లం­ఘ­న­పై అం­త­ర్గ­తం­గా ఆరా తీ­స్తు­న్న­ట్లు సమా­చా­రం. దేశ భద్ర­తా రహ­స్యా­ల­తో ము­డి­ప­డి ఉన్న అంశం కా­వ­డం­తో, ఈ లీ­కే­జీ­కి కా­ర­కు­లైన వా­రి­పై కఠిన చర్య­లు తీ­సు­కు­నే అవ­కా­శం కని­పి­స్తోం­ది.

Tags:    

Similar News