Iran : జుట్టు కత్తిరించుకొని.. హిజాబ్‌ను కాల్చివేస్తున్న ఇరాన్ మహిళలు..

Iran : ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా మహిళలు పెద్దఎత్తున ఉద్యమం చేస్తున్నారు. అనేక తరహాలో ఉద్యమం మొదటుపెట్టారు

Update: 2022-09-19 13:19 GMT

Iran : ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా మహిళలు పెద్దఎత్తున ఉద్యమం చేస్తున్నారు. అనేక తరహాలో ఉద్యమం మొదటుపెట్టారు. కొత్తగా జుట్టుకత్తిరించుకొని అక్కడ మహిళలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్‌లో ఎన్నో యేళ్లుగా కఠినమైన షరియా చట్టాలు అమలవుతున్నా విషయం తెలిసిందే.

ఇరాన్ అధ్యక్షుడు జులైలో మరో కఠిన నిబంధనను తీసుకొని వచ్చాడు. హిజాబ్‌ను ముస్లిం మహిళలు సరైన విధంగా ధరించకుంటే కఠిన శిక్ష తప్పదని, అరెస్టులు కూడా చేస్తామని ఆర్డర్ పాస్ చేశారు. దీనిలో భాగంగా ఇరాన్ పోలీసులు 22 ఏళ్ల మహ్సా అమిని ని హిజాబ్ సిరిగా ధరించలేదని అరెస్ట్ చేశారు. ఆమెను కస్టడీలోకి తీసుకున్న తరువాత ఆమెకు గుండెపోటు వచ్చింది. తరువాత కోమాలోకి వెళ్లి గత శుక్రవారం మరణించింది.

హిజాబ్ పోలీసులు ఇద్దరూ కలిసి మహ్సా అమిని ని చంపారంటూ ఇరాన్ మహిళలు రోడ్డెక్కారు. వారి హిజాబ్‌లను కాల్చివేస్తూ.. జుట్టు కత్తిరించుకొని సోషల్ మీడియాలో అపలోడ్ చేస్తున్నారు. ఈ నిరసన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Tags:    

Similar News