Joe Biden: రష్యాను టార్గెట్ చేసిన అమెరికా.. బైడెన్ కీలక నిర్ణయం..
Joe Biden: ఉక్రెయిన్‌పై సైనిక దాడి చేస్తున్న రష్యాను అగ్రరాజ్యం అమెరికా ఆంక్షల ఛట్రంలో బిగిస్తోంది.;
Joe Biden: ఉక్రెయిన్‌పై సైనిక దాడి చేస్తున్న రష్యాను అగ్రరాజ్యం అమెరికా ఆంక్షల ఛట్రంలో బిగిస్తోంది. ఇప్పటికే పలు ఆర్థిక ఆంక్షలు ప్రకటించిన అమెరికా తాజాగా తమ గగనతలంపై రష్యా విమానాలపై నిషేధం విధించింది. జాతినుద్దేశించి ప్రసంగించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ మేరకు ప్రకటించారు.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను చుట్టుముట్టి యుద్ధ ట్యాంకులతో రష్యా అధ్యక్షుడు పుతిన్ దాడిచేస్తున్నారని.. ఉక్రెయిన్ ప్రజల హృదయాలను ఆయన ఎప్పటికీ పొందలేరని, పుతిన్ ఓ నియంత అన్నారు. ఉక్రెయిన్ ప్రజలతో అమెరికా ఉందని, నాటోలోని ప్రతి అంగుళం భూభాగాన్ని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. పుతిన్ దీర్ఘకాలంలో భారీ మూల్యం చెల్లించక తప్పదని బైడెన్ హెచ్చరించారు.