Joe Biden : సంక్షోభం దిశగా అమెరికా.. అలా ఎప్పటికీ కాదన్న బైడెన్
Joe Biden : అమెరికాలో ఆర్ధిక మాంద్యం ఆ దేశ పాలకులను ఆందోళనకు గురిచేస్తోంది;
America : అమెరికాలో ఆర్ధిక మాంద్యం ఆ దేశ పాలకులను ఆందోళనకు గురిచేస్తోంది. 40 ఏళ్లలో ఎన్నడే లేనంత ద్రవ్యోల్బనం ఇప్పుడు రికార్డయింది. అమెరికా వృద్ధి రేటు కూడా తొలి త్రైమాసికంలో 1.6 శాతం తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే అమెరికాలో కూడా ఆర్ధిక సంక్షోభం తప్పదని పలువురు అంటున్నారు.
అయితే అమెరికా సంక్షోభం దిశగా పయనించదని.. కార్మిక రంగం చాలా పఠిష్టంగా ఉన్నందువల్ల అమెరికా ఆర్ధిక పరిస్థితి కొంత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. బైడన్‌కు ఉన్న ఆదరణ కూడా క్రమక్రమంగా తగ్గిపోతుంది. ట్రంప్ హయాంలో ఆయనకున్న ఆదరణ కంటే ప్రస్తుతం బైడన్‌కు ఆదరణ ఆమోదం తగ్గుతోందని తెలుస్తోంది.