North Korea: నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరికలు..
North Korea: అమెరికా, సౌత్ కొరియాతో ఉద్రికత్తలు పెరిగిన వేళ కిమ్ జోంగ్ ఉన్.. తీవ్ర హెచ్చరికలు చేశారు.;
North Korea: అమెరికా, సౌత్ కొరియాతో ఉద్రికత్తలు పెరిగిన వేళ నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. తీవ్ర హెచ్చరికలు చేశారు. శత్రు దేశాలపై అణ్వాయుధాలను ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. కొరియా యుద్ధం 69వ వార్షికోత్సవం సందర్భంగా మాజీ సైనికులను ఉద్దేశించి మాట్లాడిన కిమ్.. అమెరికా ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని దుయ్యబట్టారు. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా చేపట్టదలిచిన యుద్ధ విన్యాసాలను.. తమపై దండయాత్రకు రిహార్సల్స్‌గా ఉత్తర కొరియా భావిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.