Ganesh Temple Street: ఇండియన్ కల్చర్‌ను ఫాలో అవుతున్న అమెరికా.. దేవుడి పేరుతో స్ట్రీట్..

Ganesh Temple Street: తాజాగా న్యూయార్క్‌లోని ఓ స్ట్రీట్‌కు గణేషుడి పేరు పెట్టడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది.

Update: 2022-04-05 09:45 GMT

Ganesh Temple Street: అమెరికా అంటే అభివృద్ధి చెందిన దేశం. అక్కడ మూఢనమ్మకాలు లాంటివి పాటించరు ప్రజలు. కానీ వారికి ఇండియన్ కల్చర్ అంటే మాత్రం చాలా ఇష్టం. ఇప్పటికే ఇది చాలా సందర్భాల్లో ప్రూవ్ అయ్యింది. దేవుళ్లను పూజించడం, ఇండియన్ స్టైల్‌లో పెళ్లిళ్లు చేసుకోవడం లాంటివి ఫాలో అవుతుంటారు అమెరికన్లు. అదే అభిమానంతో తాజాగా న్యూయార్క్‌లోని ఓ స్ట్రీట్‌కు గణేషుడి పేరు పెట్టడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది.

అమెరికన్స్‌ది స్ట్రీట్ స్టైల్. అక్కడ రోడ్డు నెంబర్లకంటే ఎక్కువగా స్ట్రీట్ పేర్లే ఉంటాయి. అయితే తాజాగా న్యూయార్క్‌లోని క్వీన్స్ బరోలోని ఫ్లషింగ్‌లోని ఓ వీధికి 'గణేష్ టెంపుల్ స్ట్రీట్' అని పేరు పెట్టారు. అంతే కాదు ఈ నామకరణం కార్యక్రమాన్ని చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. ఈ ప్రత్యేక నామకరణ కార్యక్రమానికి న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్, న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఆ వీధిలో ఉన్న గణేష్ టెంపుల్ గౌరవార్థం దానికి గణేష్ టెంపుల్ స్ట్రీట్ అని పేరు పెట్టారు. ఈ టెంపుల్ హిస్టరీ ఏంటంటే.. దీనిని 1977లో స్థాపించారు. నార్త్ అమెరికాలోనే పురాతన దేవాలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. ముందుగా ఈ స్ట్రీట్‌కు ప్రముఖ అమెరికన్ ఉద్యమకారుడు జాన్ బౌన్ పేరు ఉండేది. ఆయన గుర్తుగా దీనిని 'బౌన్ స్ట్రీట్' అని పిలుచుకునేవారు. ఇప్పుడు ఇది గణేష్ టెంపుల్ స్ట్రీట్‌గా మారిపోయింది. ఈ నూతన పరిణామంపై భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News