Israel: లెబనాన్‌లోని బెకా లోయపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు

హిజ్బుల్లా సీనియర్ కమాండర్‌తో పాటు 10 మంది మృతి

Update: 2026-02-22 03:16 GMT

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. లెబనాన్‌లోని బెకా లోయ లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడిలో ఓ సీనియర్ హిజ్బుల్లా ఫీల్డ్ కమాండర్‌తో సహా 10 మంది మరణించారు. మరో 50 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. నవంబర్ 2024లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని తెలుస్తోంది.

ఈ ఘటనపై లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. మృతుల్లో సాధారణ పౌరులు కూడా ఉన్నారని, గాయపడిన వారిలో చిన్నారులు ఉన్నారని ధ్రువీకరించింది. మరణించిన 10 మందిలో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ దాడితో బెకా లోయ ప్రాంతం శోక సంద్రంలో మునిగిపోయింది.

మరోవైపు, ఈ దాడిని ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. తమపై దాడి చేసేందుకు హిజ్బుల్లా సన్నాహాలు చేస్తున్నట్లు కచ్చితమైన సమాచారం అందడంతోనే ఈ చర్యలు తీసుకున్నామని తెలిపింది. బెకా లోయలోని హిజ్బుల్లా కమాండ్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే, ఈ ఘటనపై హిజ్బుల్లా వైపు నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. తాజా పరిణామంతో ఇరు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Tags:    

Similar News