Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై ఊహాగానాలు.. ఎక్కువ రోజులు బతకలేరంటూ..
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఆరోగ్యంపై అనేక ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి.;
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఆరోగ్యంపై అనేక ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి. ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, ఎక్కువ రోజులు బతికి ఉండలేరంటూ వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఆయనకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయింది. క్రెమ్లిన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పుతిన్... నిలబడలేక ఇబ్బంది పడుతున్నాడని, వణకుతున్నాడని న్యూయార్క్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో పోడియం వద్ద నిలబడ్డ పుతిన్ వణుకుతున్నట్లు కనిపించారు. దీనిపై అంతర్జాతీయ మీడియోలనూ అనేక కథనాలు వస్తున్నాయి. ఆయన రక్త కాన్సర్‌తో బాధపడుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఆయన వెన్నుకు ఆపరేషన్ జరిగిందని తెలుస్తోంది.