Masood Azhar : మసూద్ ను అరెస్ట్ చేయాలని తాలిబన్లకు లేఖ..
Masood Azhar : తాలిబన్లకు పాక్ ప్రభుత్వం లేఖ రాసింది
Masood Azhar : తాలిబన్లకు పాక్ ప్రభుత్వం లేఖ రాసింది. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్‌ను ఎక్కడ ఉన్నా పట్టుకొని అరెస్ట్ చేయమని ఆ లేఖలో పేర్కొంది. ఆఫ్గనిస్తాన్‌లో ఇప్పుడు తాలిబన్ల రాజ్యం నడుస్తోంది. అక్కడే మసూద్ తలదాచుకున్నట్లు పాక్ ప్రభుత్వానికి పక్కా సమాచారం ఉంది. అప్ఘనిస్థాన్‌లోని నంగ్రహార్ ప్రావిన్స్ లేదా కునార్ ప్రావిన్స్‌లో తలదాచుకొని ఉండొచ్చని పాక్ ఆ లేఖలో తాలిబన్లకు వివరించింది.
భారత్ గతంలోనే మసూద్‌ను పట్టుకున్నా 1999లో ఉగ్రవాదులు భారత్ ఫ్లైట్‌ను హైజాక్ చేసి మసూద్‌ను విడిపించారు. 2019 పుల్వామా దాడి మాస్టర్ మైండ కూడా మసూదేనని భారత్ దృవీకరించింది. ఉగ్రవాదులను అరెస్ట్ చేయాలని పాక్‌పై ఐరాస కూడా ఒత్తిడి తేవడంతో పాక్ ఈ లేఖ రాసింది.