Mandeep Kaur USA: అమెరికాలో భారత వివాహిత ఆత్మహత్య.. నెట్టింట దుమారం..

Mandeep Kaur USA: ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రణజోద్‌వీర్ సింగ్ సంధు.. మణదీప్ కౌర్‌ను 2015లో వివాహం చేసుకున్నాడు.

Update: 2022-08-08 02:30 GMT

Mandeep Kaur USA: ఇప్పటికీ అమెరికా సంబంధం అనగానే అమ్మాయి బాగుంటుంది అన్న ఉద్దేశ్యంతో పెళ్లి చేసి పంపించే తల్లిద్రండులు ఉన్నారు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత చాలామంది ఆనందంగా జీవిస్తుంటే.. కొందరు మాత్రం గృహహింసకు బలవుతున్నారు. ఇలాంటి ఘటనలు కొన్ని మాత్రమే బయటికి వస్తున్నారు. అలా బయటికి వచ్చిన ఓ ఘటన నెట్టింట దుమారం రేపుతోంది.

ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రణజోద్‌వీర్ సింగ్ సంధు.. మణదీప్ కౌర్‌ను 2015లో వివాహం చేసుకున్నాడు. 2018లో వీరిద్దరు అమెరికాకు వెళ్లారు. అక్కడ న్యూయార్క్‌లో జీవనం సాగిస్తున్నారు. అయితే ఇద్దరు ఆడపిల్లలే పుట్టడంతో మణదీప్‌ను వేధింపులకు గురిచేశాడు భర్త. ఇదే విషయాన్ని ఆగస్ట్ 3న సెల్ఫీ వీడియో తీసి తల్లిదండ్రులకు పంపింది మణదీప్. ఆపై ఆత్మహత్య చేసుకొని చనిపోయింది.

మణదీప్ సెల్ఫీ వీడియో ఆధారంగా అమెరికాలో తన భర్త రణజోద్‌వీర్‌ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇండియాలో ఉన్న వారి కుటుంబాన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక మణదీప్ సూసైడ్ సెల్ఫీ వీడియో వైరల్ అవ్వడంతో నెట్టింట్లో దుమారం చెలరేగింది. తనకు న్యాయం జరగాలంటూ నెటిజన్లు ఒకటయ్యారు. హ్యాష్‌ట్యాగ్ జస్టిస్ ఫర్ మణదీప్‌తో తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు.


Tags:    

Similar News