Ranil Wickremesinghe: శ్రీలంక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘేకు బాధ్యతలు..

Ranil Wickremesinghe: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఎట్టకేలకు రాజీనామా చేశారు.

Update: 2022-07-15 10:00 GMT

Ranil Wickremesinghe: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఎట్టకేలకు రాజీనామా చేశారు. సింగపూర్ చేరుకున్న తర్వాత తన రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపారు. శ్రీలంక నుంచి మాల్దీవుల చేరుకున్న గొటబాయ.. అక్కడి నుంచి సౌదీ ఎయిర్‌లైన్స్‌ విమానం ఎస్వీ 788లో సింగపూర్‌ చాంగీ విమానాశ్రయం చేరుకుని.. అక్కడినుంచి ఓ హోటల్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత.. శ్రీలంక పార్లమెంట్‌ స్పీకర్‌కు రాజీనామా లేఖ పంపారు. గొటబాయ నుంచి లేఖ అందినట్లు నిర్ధారించిన స్పీకర్‌... ఈ మేరకు ప్రకటన చేశారు..

తాజాగా శ్రీలంక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రణిల్ విక్రమసింఘే.. ఇప్పుడు ఆ దేశానికి అధ్యక్షుడు అయ్యారు. గొటబయ రాజపక్స మాల్దీవులకు పారిపోయే ముందు విక్రమసింఘేను తాత్కాలిక దేశాధ్యక్షునిగా నియమించారు. నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఎంపీలకు అవకాశం కల్పించాలని ప్రజలను పార్లమెంటు స్పీకర్ కోరారు. అయితే ఈ ప్రక్రియ పూర్తవ్వడానికి కనీసం వారం రోజులు పడుతుంది. అప్పటివరకు రణిల్ విక్రమసింఘే శ్రీలంకకు అధ్యక్షుడిగా ఉండనున్నారు. ఇదిలా ఉండగా శనివారం నుండి శ్రీలంక పార్లమెంటు సమేవేశాలు ప్రారంభం కానున్నాయి.

Tags:    

Similar News