Russian Robot Chess: బాలుడి వేలు విరిచేసిన రోబో.. చెస్ ఆటలో..

Russian Robot Chess: ఇటీవల రష్యాలోని మాస్కోలో 'మాస్కో చెస్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌' జరిగింది.

Update: 2022-07-25 01:30 GMT

Russian Robot Chess: ప్రస్తుతం ఇది రోబో జమానా అయిపోయింది. ఎన్నో ఫారిన్ దేశాల్లో మనుషుల స్థానంలో రోబోలే అన్ని పనులను చేసేస్తుంటాయి. కానీ రోబోలకు మనుషుల్లాగా తప్పు, ఒప్పు అనే తేడా తెలియదు. అందుకే రోబో మైండ్‌లో ఉన్నదాని ప్రకారం తప్పు చేస్తే హాని కలిగించాలి. దాని కారణంగానే ఓ బాలుడు తన వేలు పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు.

ఇటీవల రష్యాలోని మాస్కోలో 'మాస్కో చెస్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌' జరిగింది. ఇందులో ఎంతోమంది జూనియర్ చెస్ ఛాంపియన్స్ పొల్గొన్నారు. అందులో ఒకడు క్రిస్టోఫర్. ఈ ఏడేళ్ల బాలుడు మాస్కోలోని 30మంది జూనియర్ స్ట్రాంగ్ చెస్ ప్లేయర్స్‌లో ఒకడు. కానీ ఈ టోర్నమెంట్‌లో క్రిస్టోఫర్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. తన వంతు రాకముందే చెస్ కాయిన్ కదపడంతో రోబో తన చేతిని గట్టిగా పట్టుకుంది. దీంతో తన వేలికి గాయమయ్యింది.

ఇదే విషయాన్ని అక్కడి అధికారులు వెల్లడించారు. గేమ్ రూల్స్‌ను బ్రేక్ చేయడం వల్లే ఇలా జరుగుంటుంది అన్నారు. ఇలాంటివి ఇప్పటివరకు జరగలేదని వివరించారు. అయితే క్రిస్టోఫర్‌కు ఇప్పుడు బాగానే ఉందని, చికిత్స అనంతరం తను మళ్లీ ఆటను కొనసాగించాడని స్పష్టం చేశారు. ఇదంతా జులై 19న జరిగినా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


Tags:    

Similar News