ISS Russia : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి రష్యా ఔట్.. కారణం అదే..

ISS Russia : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చేందుకు రష్యా సిద్ధమైంది.

Update: 2022-07-27 12:19 GMT

ISS Russia : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చేందుకు రష్యా సిద్ధమైంది. అయితే, 2024 తర్వాతే ఐఎస్‌ఎస్‌ నుంచి బయటకు రానున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని మాస్కో స్పేస్‌ ఏజెన్సీకి కొత్తగా నియమితులైన చీఫ్.. అధ్యక్షుడు పుతిన్‌కు తెలియజేశారు.

'భాగస్వామ పక్షాలకు ఇచ్చిన హామీలను తప్పకుండా పూర్తిచేస్తాం. కానీ, ఐఎస్‌ఎస్‌ నుంచి 2024 తర్వాత బయటకు రావాలని నిర్ణయించామని అని రష్యా అంతరిక్ష పరిశోధనా కేంద్రం చీఫ్‌ యురీ బొరిసోవ్‌ పేర్కొన్నట్లు రష్యా అధ్యక్ష భవనం వెల్లడించింది. ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తోన్న రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు కొనసాగిస్తోన్న వేళ క్రెమ్లిన్‌ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై పశ్చిమ దేశాలు ఆగ్రహంగా ఉన్నాయి. రష్యాపై ఆ దేశాలు ఎన్నో ఆంక్షలను విధించాయి. ఈ నేపథ్యంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. 2024 తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తప్పుకోనున్నట్టు తెలిపింది.

అయితే, అంతరిక్ష పరిశోధనలకు మాత్రం దూరం కాబోమని చెప్పింది. కొత్తగా సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనున్నట్టు రష్యా తెలిపింది. అయితే, స్పేస్ స్టేషన్ విషయంలో తమ భాగస్వాములకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు.

Tags:    

Similar News